జడ్చర్ల: డాన్స్ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లింగంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని నల్లకుంట తండాలో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాండావాసులతో డీజే పాటలతో, కేరింతలతో సందడి చేశారు. ఓ చిన్నారిని ఎత్తుకొని, మహిళలతో కలిసి తాండ వాసులను ఎమ్మెల్యే డ్యాన్స్ చేసి ఉత్తేజపరిచారు.
