మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మంగళవారం బాలానగర్ మండలంలోని గుండిడ్ గ్రామపంచాయతీ కుమ్మరి కుంట తండాలో నిర్వహించిన తుల్జా భవాని పూజా కార్యక్రమాలలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.