స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన జడ్చర్ల MLA

8చూసినవారు
స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన జడ్చర్ల MLA
మిడ్జిల్ మండలంలోని గ్రామంలో అర్హులైన పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామాల వారీగా బైరంపల్లి, కంచన్ పల్లి, దోనూర్, సింగం దొడ్డి, మసి గుండ్లపల్లి, వేముల, వాడియాల్ గ్రామాలలో మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, వార్డ్ మెంబర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొనడం జరిగినది.

సంబంధిత పోస్ట్