మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బంగారు మైసమ్మ దేవాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న బైకును బొలెరో వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ శివానంద గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.