జడ్చర్ల: మానవత్వం చాటుకున్న పోలీసులు

1480చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో ఆదివారం, 44వ జాతీయ రహదారిపై కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి రోడ్డుపై పడిపోవడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ రాఘవేందర్, శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని, మద్యం సేవించిన ఇద్దరినీ, వారి బైకును రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.