జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీ నాయకుడి ముందస్తు అరెస్ట్

0చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నవాబుపేట మండల కాంగ్రెస్ నాయకుడు భాస్కర్, ఎమ్మెల్యే సోదరుడి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించేందుకు భాస్కర్ సిద్ధం కాగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :