మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చర్లకోలా లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో బాలానగర్, రాజాపూర్, నవాబుపేట, మిడ్జిల్ మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, యువత పాల్గొని, ఒకే రోజు 1,296 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.