మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లింబ్యా తండా గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వస్పుల గ్రామానికి చెందిన కుర్వ మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.