సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో, శనివారం జాతీయ రహదారి (NH-44) పై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని టోల్ గేట్లు, ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. ఫాస్ట్ టాగ్ ఉన్నప్పటికీ, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్ టైమ్ పెరుగుతోంది. దూరప్రాంత వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి.