జడ్చర్ల: ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ

4చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఆదివారం తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గ ఇంచార్జీలు ఎల్లయ్య యాదవ్, మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి విస్తృతంగా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా గంగాపూర్ గ్రామానికి చెందిన అజీజ్, ఆంజనేయులు, కురుమయ్య, జగత్ తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.