జడ్చర్ల: బోరు నుండి ఉబికి వస్తున్న నీరు

5చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఈదమ్మ గుడి దగ్గర గ్రామపంచాయతీ బోరు నుంచి ఆదివారం ఉదయం మోటార్ ఆన్ చేయకముందే కేసింగ్ పైపు నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరగడమే దీనికి కారణమని, ఏటా ఇలాగే జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ దృశ్యం రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్