జడ్చర్ల: బోరుబావి నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు

1చూసినవారు
ఆదివారం, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన కమ్మరి సుధాకర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలోని బోరు బావి నుంచి నీరు ఉబికి రావడం చూసి ఆనందానికి గురయ్యారు. గ్రామంలోని ఇతర రైతులు కూడా ఈ నీటి ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భజలాలు పెరిగి, బోరు బావి నుంచి నీరు పైకి రావడానికి కారణమైందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్