అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జడ్చర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం 3వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను, నల్లకుంట చెరువులో ఓపెన్ జిమ్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.