జడ్చర్ల: గుండెపోటుతో యువకుడు మృతి

4చూసినవారు
జడ్చర్ల: గుండెపోటుతో యువకుడు మృతి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన కమ్మరి ప్రసాద్ చారి (28) జడ్చర్లలో కార్పెంటర్ పని చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. హోలీ పండుగ పూట యువకుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్