మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, మంత్రి కొండా సురేఖ చేసిన 'జై శ్రీరామ్' వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. హిందూ సమాజ మనోభావాలు దెబ్బతీసినందుకు మంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని
మోదీ పర్యటన భయంతోనే
కాంగ్రెస్ ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తోందని, తెలంగాణలో వచ్చేది
బీజేపీ ప్రభుత్వమేనని కొమరయ్య ధీమా వ్యక్తం చేశారు.