జడ్చర్ల: నామినేషన్ వేసేందుకు ఎగబడ్డ జనం

1409చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు చివరి రోజు కావడంతో శుక్రవారం నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా గుండేడు నామినేషన్ కేంద్రంలో అభ్యర్థులు భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని నియంత్రించడానికి తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఈ పరిస్థితి నెలకొంది.