పంచాయతీకార్యదర్శి ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ రిమాండ్

10చూసినవారు
పంచాయతీకార్యదర్శి ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ రిమాండ్
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల కార్యదర్శి రాజాశ్రీ ఆత్మహత్య కేసులో ఆమె సహోద్యోగి, మిడ్జిల్ ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్ ను పోలీసులు రిమాండ్ చేశారు. రాజాశ్రీ తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు, తమ కూతురును శ్రావణ్ లైంగికంగా వేధించడమే ఆత్మహత్యకు కారణమని కేసు నమోదు చేసి విచారించి, శ్రావణ్ ను రిమాండ్ చేసినట్లు పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు. తమ కూతురి ఆత్మహత్య కేసు కాంప్రమైజ్ అయినట్లు పుకార్లు వస్తున్నాయని, తాము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, ఇకముందు కూడా అయ్యే ప్రసక్తే లేదని కృష్ణయ్య స్పష్టం చేశారు. తమ కూతురికి జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదని, నిందితుడు శ్రావణ్ ను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్