మహబూబ్ నగర్: ఆర్టీసీలో 89 మంది కండక్టర్ల బదిలీ.!

63చూసినవారు
మహబూబ్ నగర్: ఆర్టీసీలో 89 మంది కండక్టర్ల బదిలీ.!
పాలమూరు ఉమ్మడి జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలలో పని చేస్తున్న కండక్టర్ల, డ్రైవర్లు 89 మందిని బదిలీ చేసినట్లు శుక్రవారం ఆర్ఎం సంతోష్ తెలిపారు. మెడికల్, రిక్వెస్ట్ బదిలీలు కూడా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఒకే డిపోలో పనిచేస్తున్న వారిని ఇతర డిపోలకు బదిలీ చేశామన్నారు. మహబూబ్ నగర్- 4, షాద్ నగర్-15, గద్వాల-16, నారాయణపేట-18, కల్వకుర్తి-9, కొల్లాపూర్-11, కోస్గి-3, నాగర్ కర్నూల్-10, వనపర్తి-1, అచ్చంపేట డిపోలో-2 లను బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్