మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం హన్వాడ మండలంలోని వేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఆకలితో చదువుకు దూరం కాకుండా పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించడమే ఈ సంస్థ లక్ష్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఆకలితో ఏ విద్యార్థి చదువు ఆగకుండా అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు. ఆయన స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.