మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ఈనెల 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు 12 వేల కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎం ఈ పర్యటనను ఖరారు చేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశాలున్నాయి.