మహబూబ్ నగర్: మద్యం సేవించి ఆటోలు నడపొద్దు: ఎస్ఐ

0చూసినవారు
మహబూబ్ నగర్: మద్యం సేవించి ఆటోలు నడపొద్దు: ఎస్ఐ
మహబూబ్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రాజేందర్ రెడ్డి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన అన్నారు. పట్టణంలో మద్యం సేవించి ఆటోలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఐదుగురు డ్రైవర్లకు కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించిందని తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్