మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస రెడ్డి శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని, ప్రజల నమ్మకానికి, భరోసాకు ఇదే ప్రతిక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.