పనిచేసే ప్రదేశాలు, విద్యాసంస్థలలో మహిళలపై వేధింపులు జరిగితే వెంటనే 8712659365 నంబర్‌కు కాల్ చేయాలని సోమవారం మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీం బృందం నిరంతరం పనిచేస్తుందని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. విద్యార్థినులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.