మహబూబ్ నగర్: పునరావాస కేంద్రంలో మౌలిక వసతులను కల్పించాలి

54చూసినవారు
మహబూబ్ నగర్: పునరావాస కేంద్రంలో మౌలిక వసతులను కల్పించాలి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ పునరావాస కేంద్రంలో అన్ని రకాల మౌలిక వసతులను వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఉదండాపూర్ లో పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించబోయే ప్రాంతాలను పరిశీలించారు. నిర్వాసితులకు ఫ్లాట్లు కేటాయించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్