మహబూబ్ నగర్ రీజియన్ పరిధిలోని 10 ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిషిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆర్. యం. సంతోష్ కుమార్ ఆదివారం తెలిపారు. గ్యారేజ్, ఆపరేషన్ ఆఫీసులతో పాటు వివిధ విభాగాల్లో ఈ శిక్షణ అందించబడుతుంది. 2021 తర్వాత ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్, డిప్లొమా పట్టభద్రులతో పాటు బీఏ, బీకాం, బిఎస్సి అభ్యర్థులు నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీం వెబ్ సైట్ లో ఈనెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.