మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం రాణి పేటలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. పత్తి రైతులు తమ పత్తిని ఆరబెట్టుకుని, నిర్ణీత తేమ శాతం ఉండేలా చూసుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని ఆమె సూచించారు. పత్తి ఓవర్ లోడ్ లేకుండా తీసుకురావాలని కూడా ఆమె తెలిపారు.