మహబూబ్ నగర్-బండమీదిపల్లి మార్గానికి అడ్డంగా హైవే నిర్మాణం జరుగుతుండటంతో రాకపోకలు అస్తవ్యస్తమవుతాయని ప్రజలు పాలమూరు ఎంపీ డీకే అరుణకు తెలియజేశారు. శుక్రవారం ఎంపీ అరుణ, అధికారులతో కలిసి బండమీదిపల్లి చౌరస్తాలో జరుగుతున్న హైవే పనులను పరిశీలించారు. బండమీదిపల్లి, అల్లీపూర్, గాజులపేట గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.