మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు జనం రాకపోవడంపై మంగళవారం మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మంచి పనులు చేయలేదు కనుకే ప్రజలు సభకు రాలేదన్నారు. చేసింది, చేయబోయేది చెప్పకుండా, ఎప్పటి మాదిరిగానే కేసీఆర్ ను తిట్టడానికే సీఎం సమయాన్ని వెచ్చించారని ఆయన విమర్శించారు.