మహబూబ్ నగర్: తొలి విడత ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్
మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని గండీడు, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, బాలపేట మండలాల్లోని 129 గ్రామాలు, 923 వార్డులలో పోలింగ్ గురువారం జరగనుంది. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చి, పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
