పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి మంగళవారం హన్వాడ మండల కేంద్రాన్ని పరిశీలించారు. సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన ఈ ప్రాంతంలో నామినేషన్ కేంద్రం, పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి, భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుపై అధికారులకు మార్గదర్శకాలు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీ నాయక్, ఎస్ఐ వెంకటేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.