మహబూబ్ నగర్: బక్రీద్ వేళ... కట్టుదిట్టమైన వాహన తనిఖీలు

2చూసినవారు
మహబూబ్ నగర్: బక్రీద్ వేళ... కట్టుదిట్టమైన వాహన తనిఖీలు
మహబూబ్ నగర్ ఎస్పీ ఆదేశాల మేరకు, బుధవారం కోయిలకొండ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను 1వ పట్టణ ఎస్ఐ అప్పయ్య సందర్శించి తనిఖీలు చేపట్టారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని సిబ్బందికి సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా పశువులను తరలిస్తే వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్