మహబూబ్ నగర్: బ్లాక్ లో ఫుల్.. బంకుల్లో నిల్.!

2చూసినవారు
మహబూబ్ నగర్: బ్లాక్ లో ఫుల్.. బంకుల్లో నిల్.!
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులో ఆదివారం 'నో స్టాక్' బోర్డు దర్శనమిచ్చింది. అయితే, పక్కనే ఉన్న కిరాణా దుకాణాల్లో మాత్రం బాటిళ్లలో పెట్రోల్ నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గండీడ్ మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధర చెల్లించి పెట్రోల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్