మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవు అవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం 37 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ తలిగే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత బయటికి రాకపోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు. గత వారం రోజుల నుంచి రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.