మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గురువారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద విద్యార్థుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే కాంట్రాక్టర్లకు బిల్లులు బంద్ చేసి విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించాలని ఆయన అన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.