మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో జక్కని అంజయ్య (33) అనే యువకుడు ఈ నెల 8వ తేదీన అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. తల్లిదండ్రులు మరణించడంతో, వివాహితులైన ఎనిమిది మంది సోదరీమణులు అత్తగారిళ్లలో ఉండటంతో అంజయ్య ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అతని ఆచూకీ కోసం సోదరీమణులు బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో, శుక్రవారం అంజయ్య ఆరో సోదరి రాపోలు చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.