మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి ఊపిరాడక ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చైతన్యనగర్‌కాలనీకి చెందిన పాండుకుమార్(43) ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా, ఉడకబెట్టిన గుడ్డు గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక ఇబ్బందిపడిన అతడిని కుటుంబసభ్యులు జడ్చర్ల సర్కారు దవాఖానకు తరలించారు. చికిత్స అందిస్తుండగా పాండు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.