ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశంకాదు: యెన్నంశ్రీనివాస్ రెడ్డి

3చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశంకాదు: యెన్నంశ్రీనివాస్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన వ్యక్తిగత అంశం కాదని, రాజకీయ అంశం అసలే కాదని, ఇది తెలంగాణ ప్రజల రాజ్యాంగ బద్ధమైన హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయంఅని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హైదరాబాద్లోని ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)అధికారుల ఎదుట సోమవారం ఆయన హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన మొబైల్ ఫోన్ అనుమానాస్పదంగా ట్యాపింగ్‌కు గురైందని డిఐజికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్