జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన కానిస్టేబుల్ కటిక రాజశేఖర్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ విభాగంలో సిల్వర్ మెడల్ (రన్నరఫ్) సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రతిభను ఉన్నతాధికారులు అభినందించారు.