గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, జడ్చర్ల మండలంలోని గంగాపూర్, నసురుల్లాబాద్ గ్రామాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్, రూరల్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.