జడ్చర్ల నియోజకవర్గం ఉదండాపూర్ లో బీఆర్ఎస్ పార్టీకి బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ వెంకటయ్య, సీనియర్ నాయకుడు ఎస్. ఐలప్పతో పాటు సుమారు 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే నూతన సభ్యులను ఆహ్వానించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.