
మన జీవితంలో స్కూల్ పాత్ర అత్యంత కీలకం: కోహ్లీ
ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి హాజరైన విరాట్ కోహ్లీ, విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. "మీ కలల పట్ల నిజాయితీగా ఉండండి" అని ఆయన సూచించారు. జీవితంలో పాఠశాల పాత్ర అత్యంత కీలకమని, ఉపాధ్యాయులు తమ జీవితంలో సగం సమయాన్ని విద్యార్థుల కోసమే అంకితం చేస్తున్నారని కోహ్లీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.




