మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలో, వనపర్తి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా, జేపీ దర్గా వద్ద ఒక ప్రయాణికుడు తన సెల్ ఫోన్ ను మర్చిపోయి దిగిపోయాడు. కండక్టర్ గుర్తించిన ఫోన్ ను జడ్చర్ల స్టేషన్ మేనేజర్ మరియు సెక్యూరిటీ గార్డ్ రాకేష్ సమక్షంలో ప్రయాణికుడు ఎండి మూతిబీకి తిరిగి అప్పగించారు. ఈ సంఘటన 2026 ఏప్రిల్ 28న జరిగింది. ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు.