సాహు మహారాజ్ 104వ వర్ధంతి: బీసీలకు రిజర్వేషన్లపై ఒత్తిడికి పిలుపు

0చూసినవారు
సాహు మహారాజ్ 104వ వర్ధంతి: బీసీలకు రిజర్వేషన్లపై ఒత్తిడికి పిలుపు
జడ్చర్ల మండల విద్యా వనరుల కేంద్రంలో బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహారాజ్ 104వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించి, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి అనేక సంస్కరణలు అమలు చేశారని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్ తెలిపారు. 1902లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించారని, విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, స్త్రీలు, బాలికలకు పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన రిజర్వేషన్ విధానం సామాజిక న్యాయానికి పునాది వేసిందని, తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పత్రాలను ప్రకటించి, గ్రామ జనాభాను యూనిట్‌గా తీసుకొని బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి తేవాలని పీసీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.