నారాయణపేట జిల్లా, మక్తల్ సమీపంలోని కృష్ణా నదిలో పట్టపగలే ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. తెలంగాణ ప్రాంతంలో హిటాచీతో ఇసుకను తరలిస్తున్నా, స్థానిక ఎమ్మార్వోకు ఫోన్ చేసినా స్పందన లేదని స్థానికులు తెలిపారు. ప్రధాన రహదారి 167 కిందనే ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.