సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఉదయం 7:00 గంటలకు 2K రన్ నిర్వహించనున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. నేతాజీ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు జరిగే ఈ పరుగులో యువత, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.