మహబూబ్‌నగర్ జిల్లా, రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కవాలి నదేశ్ అలియాస్ ఆనంద్ కు శుక్రవారం మహబూబ్ నగర్ ఫ్యామిలీ కోర్టు కమ్ 3వ అడిషనల్ కోర్టు జీవిత ఖైదు, రూ. 5 వేల జరిమానా విధించింది. 2024 సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనపై రాజాపూర్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ డి. జానకి అభినందించారు.