కాంగ్రెస్ పార్టీ లైన్ ఎవరూ దాటినా కఠినచర్యలు తీసుకుంటామని ఆదివారం మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ హెచ్చరించారు. కొంతమంది సీనియర్ నాయకులు సహచర నాయకులను, విలేకరులను దుర్భాషలాడటంపై ఆయన మాట్లాడుతూ, సదరు నాయకులను సున్నితంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇటువంటివి చేయవద్దని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను పాటించాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆయన తెలిపారు.