మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామఅధ్యక్షుడుగా సుధాకర్ రెడ్డి

6చూసినవారు
మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామఅధ్యక్షుడుగా సుధాకర్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండలం పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. సంబిరెడ్డి సుధాకర్ రెడ్డి గ్రామ అధ్యక్షుడిగా, కొప్పుల సైదులు ఉపాధ్యక్షుడిగా, సంబిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శిగా, బత్తుల గోపాల్ యాదవ్ కోశాధికారిగా,వల్లెపు శివ సోషల్ మీడియా బాధ్యతగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, సాయిలు, బైరంపల్లి రమేష్, శివ యాదవ్, చిల్వేరు సత్యం, కొప్పుల బంగారి, మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్