మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం హన్మసానిపల్లికి చెందిన చాకలి మమత (25) అదృశ్యమైన కేసులో పోలీసులు బుధవారం దర్యాప్తు ప్రారంభించారు. 10 ఏళ్ల క్రితం మేనమామ గోపాల్‌ను వివాహం చేసుకున్న మమత, తరచూ గొడవలు పడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 19న కూలికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన మమత 15 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సోదరుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.