మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ భూనిర్వాసితుల పరిహారంలో మిగిలిన రూ. 200 కోట్లను విడుదల చేయాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కోరారు. రూ. 350 కోట్లలో ఇప్పటికే రూ. 150 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. SDF, SC సబ్ ప్లాన్ నిధులు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.